Komuram Bheemudo Lyrics Song,కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు)

 కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు) | RRR | ఎన్టీఆర్, రామ్ చరణ్ | ఎం ఎం కీరవాణి | ఎస్ఎస్ రాజమౌళి

 

Komuram Bheemudo Lyrics Song(Telugu) | RRR | NTR,Ram Charan | M M Keeravaani | SS Rajamouli

RRR మూవీ నుండి తెలుగులో కొమురం భీముడో లిరిక్స్. కొమురం భీముడో పాటకు సాహిత్యం సుధాల అశోక్ తేజ రాశారు. కాల భైరవ పాడారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ తారాగణం. లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట డిసెంబర్ 24, 2021న విడుదలైంది.

 

పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

 

కొమురం భీముడో .. కొమురం భీముడో..

రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

 

చరణం 1 :

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగల..( వంగితే కనుక)

కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..

 

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)

జుడుము తల్లి పేగున పెరగనట్టేరో..(జుడుము అంటే అడవి)

 

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

చరణం 2 :

 

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)

 

బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)

భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

 

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

చరణం 3 :

కాలువ పారే నీ గుండె నెత్తురు

నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు

అమ్మకాళ్ల పారణైతుంది సూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు

కొమురం భీముడో.. కొమురం భీముడో..

పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..

 

 

 

 

 

 

దృశ్య సంగీతం

తారలు – ఎన్టీఆర్, రామ్ చరణ్, కాల భైరవ

కాన్సెప్ట్ & విజువలైజేషన్ – ప్రేమ్ రక్షిత్

DOP – రిషి పంజాబీ

సాహిత్యం – సుధాల అశోక్ తేజ

గాయకుడు – కాల భైరవ

 

చిత్రం: RRR

తారాగణం: ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: S.S. రాజమౌళి

సమర్పణ: డి.పార్వతి

నిర్మాత: డివివి దానయ్య

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్

కథ: వి.విజయేంద్ర ప్రసాద్

DOP: K.K. సెంథిల్ కుమార్

ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్

సంగీత స్వరకర్త: ఎం ఎం కీరవాణి

VFX పర్యవేక్షణ: V శ్రీనివాస్ మోహన్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి

లైన్ ప్రొడ్యూసర్ – ఎస్ ఎస్ కార్తికేయ

పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ – MM శ్రీవల్లి

  • Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్
  • Komuram Bheemudo Lyrics Song,కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు)
  • Loka Veeram Mahapoojyam Ayyappa Lyrics,లోక వీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విపుమ్
  • Mallepula Pallaki Bangaru Pallaki Ayyappa,మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
  • Jeevitham Lo Oka saraina Sabari Yatra Chehra,జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా
  • Pallikattu Sabarimalaiki Ayyappa Lyrics, పల్లికట్టు శబరి మలైక్కు కల్లుమ్ ముల్లుం కాళుక్కు మెతై
  • Adhigo Adhigo Sabari Mala Ayyappa Lyrics,అదిగో అదిగో శబరి మాల అయ్యప్ప లిరిక్స్
  • Thom Tindaka Tom Ayyappa Swami Tindaka Thom,తోం తిందాక తోం అయ్యప్ప స్వామి తిందాక తోం అయ్యప్ప  భజనలు పాటల లిరిక్స్
  • Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics,దండాలమ్మో దండాలమ్మో లిరిక్స్ అయ్యప్ప భజనలు 
  • Vuyyala Uguthunnadu Ayyappa swami Song Lyrics telugu,వుయ్యాలా లుగుతున్నాడు…. అయ్యప్ప స్వామి

 

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra